హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా సమస్యలు పరిష్కరించాలి: సీఎంకు సీపీఎం లేఖ

ములుగు జిల్లా సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.రెడ్డి సాంబశివ ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ విడుదల చేశారు. రైతులకు గోదావరి జలాలు అందించాలని, మూతపడిన కమలాపురం రేయాన్స్‌ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కోరారు. ములుగుకు రింగ్‌రోడ్డు నిర్మించాలని, సాగుభూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.