హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులైన ప్రతి పేద కుటుంబానికి డిజిటల్ రేషన్ కార్డు'

NRML: అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం అన్నారు. నిర్మల్‌ మండలం కడ్తాల్‌ సాగర్‌ కన్వెన్షన్‌లో శనివారం నూతన డిజిటల్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరేశం మాట్లాడుతూ.. జిల్లాలో 2,49,313 నూతన డిజిటల్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.