హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు

HNK: సీఎం రేవంత్‌రెడ్డి పరకాల పర్యటన నేపథ్యంలో కేయూ పోలీసులు ఆదివారం బీజేపీ నేతలతో పాటు ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్‌ను ముందస్తుగా అరెస్టు చేశారు. ఎలాంటి నిరసనకు పిలుపునివ్వకపోయినా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సంతోష్ విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ప్రశ్నించే నాయకులను అరెస్టు చేయడం సరికాదన్నారు.