హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగూర్‌లో 4.376 టీఎంసీల నీటి నిల్వ

SRD: సింగూర్ జలాశయానికి వరద నీటి ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 515.320 మీటర్లకు చేరిందని అధికారులు వెల్లడించారు. జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.376 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టులోకి 611 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 380 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.