హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

WGL: శ్రావణ మాసం సందర్భంగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. వేకువజామున అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం చేసి, అనంతరం నూతన పట్టు వస్త్రాలు, ఆభరణాలతో లక్ష్మీ స్వరూపంగా అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం నగరంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.