KMM: కామేపల్లి మండలంలోని ముచ్చర్ల గ్రామ శివారులో పేకాట స్థావరంపై ఆదివారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు దాడి చేశారు. ఖమ్మం పట్టణానికి చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని రూ. 53,650 నగదు, ఐదు సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పి. శ్రీకాంత్ తెలిపారు. మరో ఎనిమిది మంది పరారైనట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
పేకాట స్థావరం పై దాడి ఆరుగురు అరెస్ట్


