PDPL: మంథని మండలం కన్నాల గ్రామంలో మత్తు పదార్థాల విక్రయాలపై గ్రామపంచాయతీ కఠిన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి లిక్కర్, గుడుంబా, డ్రగ్స్ విక్రయిస్తే రూ.50 వేల జరిమానా విధించాలని గ్రామసభలో తీర్మానించారు. సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సభలో ఆమోదించిన తీర్మాన ప్రతిని మంథని పోలీస్, ఎక్సైజ్ అధికారులకు అందజేశారు.
తెలంగాణ
'మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన నిర్ణయం'


