హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివాహితను కాపాడిన పోలీసులు

PDPL: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన మందమర్రికి చెందిన ఓ వివాహిత శనివారంరాత్రి గోదావరిఖని శివారులోని గోదావరి నది బ్రిడ్జిపై నుంచి దూకేందుకు ప్రయత్నించింది. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి సిబ్బందిని పంపించి ఆమెను సురక్షితంగా కాపాడారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు. బ్లూకోట్స్ సిబ్బంది మహేశ్, నగేశ్‌ను సీఐ అభినందించారు.