హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయంగా మారిన బీటీ రహదారి..!

GDWL: తూర్పుగార్లపాడు నుంచి బుదమర్రికు వెళ్లే బీటీ రహదారి ప్రమాదకరంగా మారిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ దారిలో టిప్పర్లు తిరగడం, ఇసుక ట్రాక్టర్లతో చాలా చోట్ల లోతైన గుంతలు ఏర్పడ్డాయి. వాహనదారులు రెప్పపాటు క్షణం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి  రోడ్డు పునరుద్ధరణ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.