హైదరాబాద్: 28°C
తెలంగాణ

ద్విచక్ర వాహనాల చోరీ ముఠా అరెస్ట్: SP

ADB: ఆదిలాబాద్‌లో బైక్ చోరీలకు పాల్పడుతూ వాటిని విడిభాగాలుగా విక్రయిస్తున్న 10 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు SP అఖిల్ మహాజన్ శనివారం తెలిపారు. ప్రత్యేక పోలీస్ బృందాలు దాడి చేసి 6 బైకులు, 21 ఇంజిన్లు, భారీగా విడిభాగాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చోరీ వాహనాలు కొనే వారిపై కఠిన చర్యలుంటాయని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు.