NRPT: ఉట్కూరు మండలం కొల్లూరు గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. రహదారి దెబ్బతినడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. సమస్యను అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్డు గుంతలమయం.. ప్రయాణికుల అవస్థలు


