హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీగా కల్తీ బెల్లం పట్టివేత.. కేసు నమోదు

VKB: బంట్వారంలో కల్తీ బెల్లం వ్యవహారం బయటపడింది. జిల్లా SP స్నేహ మోహ్రా ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో తాండూరుకు వెళ్తున్న ఆటోను తనిఖీ చేయగా.. 4 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టుబడింది. ఆటోలో ఉన్న వ్యక్తులను విచారించి దుకాణంలో ఉన్న నిల్వలతో కలిపి మొత్తం 7500 కిలోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.