హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొలెరోతో ఢీకొట్టడంతో మహిళ మృతి!

NGKL: జిల్లాలోని తాడూరు శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. రాకొండకు చెందిన బంగారమ్మ(43) కూలి పనికి వెళ్లగా, డబ్బుల విషయంలో దూరపు బంధువు భీమయ్యతో వివాదం జరిగింది. వాగ్వాదం అనంతరం భీమయ్య బొలెరో వాహనంతో ఆమెను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన తర్వాత నిందితుడు పరారయ్యాడు. కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.