SRD: ఖేడ్(M) హాంగర్గా( K) చెందిన గైని రుక్మిణి ఆదివారం తెల్లవారుజామున 108లో ప్రసవించింది. తన నాలుగో కాన్పుకు పురిటి నొప్పులు రాగా 108లో ఖేడ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో EMT సంగ్ శెట్టి, పైలెట్ వసంత్ సహాయంతో అంబులెన్స్ లోనే మహిళకు పురుడు పోశారు. ఆడ శిశువు జన్మనిచ్చిందని తల్లి బిడ్డ క్షేమమని EMT చెప్పారు. ఖేడ్ ఆసుపత్రిలో చేర్పించామన్నారు.
తెలంగాణ
108లో మహిళ ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం


