హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేలను తాకేలా విద్యుత్ స్తంభం

MLG: ఏటూరునాగారం మండలం రాంనగర్‌ సమీపంలో విద్యుత్‌ స్తంభం 15 రోజులుగా ఒరిగి నేలను తాకేలా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్తంభానికి ఉన్న విద్యుత్‌ తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా మారడంతో పొలాలకు వెళ్లే రైతులు భయాందోళన చెందుతున్నారు.ప్రమాదం జరిగే వరకు అధికారులు స్పందించరా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.