హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యలపై 25న బీజేపీ మహాధర్నా

వరంగల్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈనెల 25 న 24 గంటల మహాధర్నా నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. శనివారం శివనగర్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ నివాసంలో జరిగిన సమావేశంలో డివిజన్లలోని దీర్ఘకాలిక సమస్యలపై చర్చించారు.మున్సిపల్‌ అధికారులు, పాలకులు నిర్లక్ష్య వైఖరి వీడి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.