హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

SRD: పటాన్‌చెరు బస్టాండ్ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఇస్నాపూర్ నుంచి లింగంపల్లి వైపు వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.