హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి మండలంలో ప్రజావాణి సేవలు: కలెక్టర్

KMR: కామారెడ్డి జిల్లాలో రేపటి నుంచి ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రజలు మండల కేంద్రాల్లో తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. అందిన అర్జీలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.