హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తుతెలియని మృతదేహం లభ్యం..!

SRD: పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటాన్ని స్థానికులు గుర్తించి పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేశారు.