హైదరాబాద్: 28°C
తెలంగాణ

చోవా కోక్ సుయ్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు

SRPT: గ్రాండ్ మాస్టర్ చోవా కోక్ సుయ్ జయంతిని పురస్కరించుకుని ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సూర్యాపేట, హుజూర్‌నగర్ శాఖల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హుజూర్‌నగర్ చింతలబజార్, బుడిగజంగాల కాలనీ, సర్వారం గ్రామాల్లో నిరుపేదలకు బియ్యం, పండ్లు పంపిణీతో పాటు రూ. 2 వేల నగదు సహాయం అందించారు. మానవ సేవే మాధవ సేవ అని నిర్వాహకులు తెలిపారు.