BHNG: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చల్లూరులో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై తఖీయోద్దీన్ కథనం ప్రకారం.. బడే నాగరాజు(41) కుటుంబంలో నెలకొన్న కలతల కారణంగా భార్యతో విడిపోయి మద్యానికి బానిసయ్యాడు. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు, మద్యం మత్తు కారణంగా మనోవేదన చెంది ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు పరశురాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.
తెలంగాణ
ఉరేసుకుని వ్యక్తి మృతి..!


