హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు బస్సులు ఢీకొని ముగ్గురికి స్వల్పగాయాలు.!

SRPT: మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారి-65పై ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న శ్రీకృష్ణ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఏలూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.