హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

PDPL: ముత్తారం మండల పరిధిలోని ఓడేడు గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఎస్సై రవికుమార్ కథనం ప్రకారం.. ఓడేడు శివారులో రహస్యంగా పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో సిబ్బందితో కలిసి స్థావరంపై మెరుపు దాడి చేసి నలుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.3,030 నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.