హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో చికెన్ ధరల వివరాలు.!

KMR: జిల్లాలో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. శ్రావణమాసం కావడంతో మాంసపు ప్రియులు తగ్గారు. దీంతో కిలో చికెన్ రూ. 200 ఉండగా, స్కిన్ లెస్ రూ. 220లకు విక్రయిస్తున్నారు. లైవ్ కోడి రూ. 110-రూ.160 వరకు ధర పలుకుతోంది. డజన్ గుడ్లు రూ. 74గా ఉన్నాయి. మటన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కామారెడ్డిలో కిలో మటన్ రూ. 880-రూ. 1000 వరకు విక్రయిస్తున్నారు.