హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలకు 4 కంప్యూటర్లు మంజూరు.!

WNP: ఆత్మకూరు మండలంలోని జూరాల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ప్రభుత్వం నుంచి నాలుగు కంప్యూటర్లు మంజూరయ్యాయి. పాఠశాలలో ఏర్పాటు చేసిన వీటిని గ్రామ సర్పంచ్ గుడిసె నరసింహులు ప్రారంభించారు. ప్రభుత్వం కల్పించిన ఈ డిజిటల్ సౌకర్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.