హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీట మునిగి వ్యక్తి మృతి

NLG: నేరేడుగొమ్ము మండలంలోని వైజాగ్ కాలనీలో నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌కు విహారయాత్రకు వచ్చిన ఓ యువకుడు స్నానం చేస్తుండగా మృతి చెందిన విషాద ఘటన శనివారం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన దుర్గం తిరుమలేష్ తన స్నేహితులతో కలిసి బ్యాక్‌వాటర్‌లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం.