హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు సాగునీరు.. తుంగతుర్తికి గోదావరి జలాలు

SRPT: దేవాదుల ఎత్తిపోతల పథకం ఆరో దశను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పదవీకాలంలోనే అందుబాటులోకి తీసుకొస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం పునరుద్ఘాటించారు. దీంతో సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జలాలను అందించే మార్గం సుగమం అవుతుందని తెలిపారు.