హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. రాఘవపురం ఎక్స్‌ రోడ్డు వద్ద శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మోతె మండలం రాఘవపురం గ్రామానికి చెందిన బయ్య మహేష్‌ (14), తండ్రి సైదులు.. పీఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలోని జాతీయ రహదారి దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.