హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.35 వేల కోట్ల రుణమాఫీ చేయాలి: హరీశ్ రావు

SDPT: రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.35 వేల కోట్ల రుణమాఫీ చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని చెప్పిన వీడియోను పరిశీలించాలని సూచించారు. రైతు బిడ్డవైతే రుణమాఫీ చేయాలని అన్నారు. రైతుబంధు పెంచుతామని చెప్పే ముందు రూ.15 వేల కోట్ల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.