ADB: CCI పునరుద్ధరణ కోరుతూ సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారంతో 7వ రోజుకు చేరాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని మాట్లాడుతూ.. పరిశ్రమలను ప్రైవేటీకరించడం సిగ్గుచేటన్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఈ పరిశ్రమను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'సీసీఐ పునరుద్ధరణే లక్ష్యంగా సత్యాగ్రహ దీక్ష'


