హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రధాని ఫోటో మిస్సింగ్.. బీజేపీ శ్రేణుల ఆందోళన

ADB: ఆదిలాబాద్ పట్టణంలో శనివారం నిర్వహించిన డిజిటల్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. అధికారిక ఫ్లెక్సీలో పీఎం నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి ఫోటోలు ముద్రించకపోవడాన్ని నిరసిస్తూ BJP నేతలు నిరసనకు దిగారు. మోదీ ఫోటోతో నిరసన తెలుపుతున్న BJP నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పక్షపాత వైఖరిపై BJP నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.