హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచారామ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక యాత్ర

PDPL: పంచారామ క్షేత్రాలతో పాటు పలు పుణ్యక్షేత్రాల దర్శనానికి టీజీఎస్‌ఆర్టీసీ గోదావరిఖని డిపో ఆధ్వర్యంలో ఆగస్టు 29 నుంచి ఆరు రోజుల ప్రత్యేక యాత్ర నిర్వహించనున్నట్లు డీఎం కవిత తెలిపారు. అన్నవరం, సింహాచలం, వైజాగ్, పిఠాపురం తదితర క్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. యాత్ర టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.6,200గా నిర్ణయించారు. రిజర్వేషన్ కోసం 701350498ను సంప్రదించాలన్నారు.