హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

KNR: చొప్పదండి మండలం కొలిమికుంటలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చీకట్ల మహేశ్ (37) ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి అలవాటు పడటంతో కుటుంబంలో తరచూ కలహాలు జరిగేవని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతుడి సోదరుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.