NGKL: మంగనూరు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జాలం శంకరయ్య మృతి చెందారు. శంకరయ్య వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన శంకరయ్యను స్థానికులు నాగర్‌కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి


