JGL: పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. గ్రామంలోని పలుమారు మల్లయ్యకు చెందిన వరి పొలంలో మహిళా కూలీలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి వందనం సమర్పించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. మహిళా కూలీల దేశభక్తిని పలువురు అభినందించారు.
తెలంగాణ
వరి పొలంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు


