హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పింఛన్ల దరఖాస్తులకు ఆహ్వానం

KMR: ఎల్లారెడ్డి పురపాలక సంఘం పరిధిలో అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు చేయూత పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కమిషనర్ జగ్జీవన్ శనివారం తెలిపారు. సందేహాల నివృత్తికి పురపాలక కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.