హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగిసిన దరఖాస్తుల గడువు

HYD: క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తుల గడువు ముగిసింది. నగరంలోని 16నియోజకవర్గాల్లో మొత్తంగా 60,014 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 20 తర్వాత లాటరీ ద్వారా ఇళ్ల కేటాయింపు చేపట్టనున్నట్టు హౌసింగ్ బోర్డు వీసీ పి.వి.గౌతం వెల్లడించారు. నేటినుంచి ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు.