GDWL: గద్వాల్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఫ్యాన్లు తిరగకపోవడంతో ఎండ, ఉక్కపోతకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆధునిక హంగులతో నిర్మించిన బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు రావడంతో ఉక్కపోత పెరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఫ్యాన్లు బాగుచేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
బస్టాండ్‌లో తిరగని ఫ్యాన్లు.. ప్రయాణికుల అవస్థలు..!


