GDWL: అయిజ మండలంలోని సంకాపురంలో హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నేడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు వెంకట్రాములు తెలిపారు. ఈ శిబిరంలో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారని, రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
నేడు ఉచిత వైద్య శిబిరం..!


