RR: కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి ఎదురుగా పనులు పూర్తి చేయకుండా వదిలేసిన ఇనుప రాడ్లు తీవ్ర ప్రమాదకరంగా మారాయి. పాదచారులు లేదా వాహనదారులు వీటిపై పడితే ప్రాణాపాయం సంభవించే ఆస్కారముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ పోలీసులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదకరంగా ఇనుప రాడ్లు..!


