బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెం పంచాయతీ కటారివారిపాలెంలో భారీ చోరీ జరిగింది. ఒక ఇంట్లో పొలం విక్రయించగా వచ్చిన రూ.35 లక్షల నగదును దుండగులు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, ఆధారాల కోసం డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వేటపాలెం మండలంలో భారీ చోరీ..


