హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొర్రెలతో తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి...!

SS: అమరాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద గొర్రెలకాపర్లు గొర్రెలతో కలిసి ధర్నా చేశారు. తమ్మడేపల్లి, దేవదానపల్లి, నాగోనపల్లికి చెందిన చెరువులో గడ్డి మేపేందుకు సుమారు 659 ఎకరాల స్థలం ఉందని తెలిపారు. తమ్మడేపల్లి పంచాయతీ పరిధిలో సుమారు 3,500 గొర్రెలు ఉన్నాయని చెప్పారు. చెరువులో మేపేందుకు వెళ్తే ఆక్రమణదారులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.