హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుంగభద్ర జలాలతో శ్రీగుంటిరంగ స్వామికి జలాభిషేకం

KRNL: ఎమ్మిగనూరు వెంకటాపురంలో శ్రీగుంటిరంగ స్వామికి శ్రావణ తొలి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుంగభద్ర నుంచి తెచ్చిన పవిత్ర జలంతో స్వామివారికి జలాభిషేకం చేశారు. భక్తులు గోవింద నామస్మరణతో పోర్లు దండాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కోసం అన్నదానం నిర్వహించగా, నాలుగో శనివారం రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.