హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభాతభేరి ర్యాలీలో విచిత్ర ఆకారం

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం కిషన్దాస్పేట ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రభాత భేరి ర్యాలీలో ఓ విచిత్ర ఆకారం గ్రామస్థుల చర్చకు దారితీసింది. సైనిక దుస్తులు ధరించిన విద్యార్థి పొడవాటి తెల్లని ఆకారానికి ఆకుపచ్చ కండువా, త్రివర్ణ దండ అలంకరించి ఊరేగించాడు. ఇది మొహర్రం పీరీని పోలి ఉందని స్థానికులు పేర్కొన్నారు.