హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దేశ ఐక్యత కోసం స్వరాజ్య హోమం'

HYD: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు తార్నాకలోని తన నివాసంలో స్వరాజ్య హోమం నిర్వహించారు. మాజీ డీఎస్పీ నళిని ఆచార్య నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల సమక్షంలో యజ్ఞం జరిగింది. దేశ ప్రజల సుఖసంతోషాలు, సౌభ్రాతృత్వం, ఐక్యత, దేశ రక్షణకు ఈశ్వరుడి అనుగ్రహం కలగాలని ప్రార్థించారు.