హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉప్పూడి సొసైటీలో జెండా వివాదం

కోనసీమ: ఉప్పూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించకపోవడంపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత జెండాను కార్యాలయ గేటుకు కట్టి ఫొటో తీసి పంపడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. జాతీయ జెండా నిబంధనలను ఉల్లంఘించిన సొసైటీ కార్యదర్శిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.