చీఫ్ సెలక్టర్ పదవి నుంచి అగార్కర్‌ను తొలగించనున్నట్లు సాగుతున్న ప్రచారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అగార్కర్ స్థానంలో లక్ష్మణ్‌ను నియమించాలని చూస్తే, ఆయన ఈ పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపలేదట. దీంతో జహీర్ ఖాన్‌కు ఈ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు 'ది టెలిగ్రాఫ్' తమ కథనంలో వెల్లడించింది. మరోవైపు, WC ముగిసే వరకు అగార్కరే ఈ పదవిలో కొనసాగుతారని వార్తలు వస్తున్నాయి.
క్రీడలు
చీఫ్ సెలక్టర్‌గా జహీర్ ఖాన్..?


