హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

SRCL: దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థుల రాకపోకల ఇబ్బందులను గుర్తించి ఆర్మూర్‌కు చెందిన విలియన్ భాస్కర్ 12 సైకిళ్లను అందించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రుద్రంగి మండలం మానాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సైకిళ్ల పంపిణీ జరిగింది. దూర ప్రాంత విద్యార్థులకు రవాణా ఇబ్బందులు తగ్గి చదువుపై దృష్టి సారించేందుకు ఈ సహాయం ఉపయోగపడుతుందని అన్నారు.