హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జిల్లాలో 4.77 లక్షల కుటుంబాలకు డిజిటల్ కార్డులు'

NZB: జిల్లాలో 4.77 లక్షల కుటుంబాలకు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం కేటాయించిందని ఇన్‌చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ప్రతి కుటుంబానికి పారదర్శకంగా కార్డులు పంపిణీ చేసేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల నకిలీ, బినామీ కార్డులకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు తగ్గుతాయని పేర్కొన్నారు.