ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని బిజీ పేట గ్రామానికి చెందిన పావలి వెంకట సుబ్బమ్మను ఇటీవల గుర్తుతెలియని దుండగులు దాడి చేసి, ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించారు. తీవ్రంగా గాయపడిన ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై శనివారం గ్రామస్తులు నిరసన చేపట్టారు. వెంకట సుబ్బమ్మను దారుణంగా కొట్టి హత్య చేసిన నిందితులను పోలీసులు వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
హత్యపై గ్రామస్తుల నిరసన


